AP Govt Withdraws Go On Veterinary Assistant Surgeon Post: ఏపీ ప్రభుత్వం 160కుపైగా వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి ఆదేశాలిచ్చింది. తొలిసారిగా ఏపీపీఎస్సీ ద్వారా అసిస్టెంట్ సర్జన్ పోస్టులు భర్తీ చేయాలి భావించింది. కానీ ఆ నిర్ణయాన్ని మార్చుకుని.. జీవో21ని ఉపసంహరించుకుంది.. వీఏఎస్ పోస్టుల భర్తీ ప్రక్రియను డిపార్ట్‌మెంటల్ సెలక్షన్ కమిటీ ద్వారా నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మరో జీవోను విడుదల చేశారు. ఈ పోస్టుల భర్తీపై వైసీపీకి మాట్లాడే హక్కులేదన్నారు మంత్రి అచ్చెన్నాయుడు.