1 Lakh Aid For Organ Donor Families In Andhra Pradesh: అవయవదానంతో ఎన్నో ప్రాణాలను కాపాడవచ్చన్నారు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్. రాష్ట్రంలో ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కేంద్రాలను 9కి పెంచామని.. త్వరలో 12 బోధనాసుపత్రుల్లోనూ ఈ సేవలు అందుబాటులోకి తెస్తామన్నారు. దాతల కుటుంబాలకు ఇచ్చే ప్రోత్సాహకాన్ని రూ.1 లక్షకు పెంచేందుకు ప్రతిపాదనల్ని సీఎం దగ్గరకు పంపించామన్నారు. అవయవ దానంపై ప్రజల్లో చైతన్యం పెంచేందుకు ప్రభుత్వం విస్తృతంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తోందన్నారు. అవయవాల కొరతను అధిగమించేందుకు చట్టంలో మార్పులు తెచ్చామన్నారు.