ప్రజలకు మెరుగైన పరిపాలన అందించాలని ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కొత్త జిల్లాల్లో పారిపాలన ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో కొత్తగా ఏర్పాటు చేసిన మదనపల్లె జిల్లాలో పరిపాలన షురూ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. 2026 జనవరి 1 నుంచి పరిపాలన ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం. దీంతో ప్రభుత్వ కార్యాలయాల ఎంపికపై కలెక్టర్ ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది.