Visakhapatnam Lulu Mall Mou: ఆంధ్రప్రదేశ్‌లో లులు గ్రూప్ భారీ పెట్టుబడులకు సిద్ధమైంది. విశాఖపట్నంలో రూ.1,066 కోట్లతో ప్రపంచస్థాయి మాల్ నిర్మాణానికి ఒప్పందం కుదిరింది. ఈ ప్రాజెక్టుతో 5 వేల మందికి ఉపాధి లభించనుంది. రాష్ట్రం నుంచి వ్యవసాయ ఉత్పత్తులు, మామిడి, జామ పల్ప్, మసాలా దినుసుల ఎగుమతికి లులు ముందుకు వచ్చింది. రాయలసీమలో లాజిస్టిక్ కేంద్రం ఏర్పాటు చేయనుంది.