AP Dasari Caste Name Change: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీసీ ఏలో ఓ సామాజిక వర్గానికి ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. కుల ధ్రువీకరణ పత్రాలలో 'భిక్షాటన చేసే వారు' అనే పదాన్ని తొలగించింది. ఈ పదం తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తోందని దాసరి సామాజిక వర్గం ఆందోళన వ్యక్తం చేయడంతో ప్రభుత్వం స్పందించింది. ఇకపై కుల ధ్రువీకరణ పత్రాలలో కేవలం 'దాసరి' అని మాత్రమే పేర్కొనాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు అధికారులు చర్యలు చేపట్టారు.