Guntur To Nizampatnam Greenfield Express Highway: గుంటూరు నుంచి నిజాంపట్నం పోర్టుకు జాతీయ రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు వచ్చాయి. ఈ హైవే గుంటూరును తీర ప్రాంతానికి కలుపుతూ ఆక్వా ఉత్పత్తుల రవాణాకు సులువుగా ఉంటుంది. సుమారు రూ.1400 కోట్ల నుంచి రూ.1500 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా. ఈ రహదారి కోల్‌కతా-చెన్నై జాతీయ రహదారి 16కు కలుస్తుంది. గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే పూర్తయితే ప్రాంతం అభివృద్ధి చెందుతుంది.