సంక్రాంతి పండుగ వేళ ఆంధ్రప్రదేశ్‌లో జరిగే కోడి పందేల కోసం తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల కోళ్లకు భారీ గిరాకీ ఏర్పడింది. అశ్వారావుపేట, దమ్మపేట పరిధిలోని ఆయిల్ పామ్ తోటలు ఇప్పుడు పందెం కోళ్ల ప్రధాన ఉత్పత్తి కేంద్రాలుగా మారాయి. ఇక్కడ అసీల్, నెమలి, కాకి, డేగ వంటి జాతి కోళ్లకు బాదం, జీడిపప్పు, మాంసం వంటి బలమైన ఆహారం ఇచ్చి ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు. ఒక్కో కోడి ధర 5 వేల నుండి 2 లక్షల రూపాయల వరకు పలుకుతుంది.