ఏపీ రాజధాని అమరావతిని అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలని భావిస్తోన్న ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపడుతోంది. అమరావతిలో అంతర్జాతీయ స్పోర్ట్ సిటీ నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు తన సింగపూర్ పర్యటనలో సింగపూర్ స్పోర్ట్స్ స్కూల్ సందర్శించారు. అక్కడ అందిస్తున్న ట్రైనింగ్ వివరాలు, చదువుతో పాటుగా క్రీడలలో ఎలా శిక్షణ ఇస్తున్నారనేదీ అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో చంద్రబాబు వెంట బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ కూడా ఉన్నారు. అమరావతి స్పోర్ట్స్ సిటీలో గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో.. సింగపూర్ స్పోర్ట్స్ స్కూల్ సందర్శన ప్రాధాన్యం సంతరించుకుంది.