ఆంధ్రప్రదేశ్‌లో జనగణన ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు తొలిదశ ఇళ్ల సేకరణ పనులు జరగనుండగా.. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జనాభా లెక్కల సేకరణ చేపడతారు. ఈ విధులకు ఆటంకం కలిగించే వారిపై జరిమానాతో పాటు జైలు శిక్ష విధించేలా ప్రభుత్వం కఠిన ఉత్తర్వులు జారీ చేసింది. పకడ్బందీ నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా వివిధ స్థాయిల్లో ప్రత్యేక అధికారులను, కమిటీలను నియమించింది.