Maoists Threaten To Four Ap Ministers: ఏపీలో మంత్రులకు బెదిరింపుల లేఖలు వచ్చాయి. మావోయిస్టుల పేరుతో లేఖలు ఏకంగా మంత్రుల పేషీలకు రావడం కలకలం రేపింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు ఈ లేఖలకు సంబంధించి ఓ మొబైల్ నంబర్‌ను గుర్తించారు. వెంటనే ఆ నంబర్‌కు కాల్ చేసి ఆరా తీస్తే.. తెలంగాణకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఎవరో ఉద్దేశపూర్వకంగా తన నంబర్ ఇచ్చారని చెప్పుకొచ్చారట.