ఏపీలో పింఛన్‌దారులకు ముఖ్య గమనిక. దివ్యాంగుల పింఛన్లు ఎక్కువ మంది అనర్హులు పొందుతున్నారంటూ ప్రభుత్వం ఇటీవల వైకల్య నిర్థరణ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందులో వైకల్య శాతం తక్కువగా ఉన్నవారికి నోటీసులు కూడా అందించారు. అయితే దివ్యాంగుల నుంచి ఆందోళన రావటంతో నోటీసులతో సంబంధం లేకుండా సెప్టెంబర్ నెల పింఛన్లు అందరికీ అందజేశారు. అయితే ఇప్పుడు అక్టోబర్ నెల రావటంతో నోటీసులు అందుకున్న వారిలో ఆసక్తి మొదలైంది. ఈ క్రమంలోనే ఏపీ పింఛన్లపై కీలక అప్ డేట్ వచ్చింది. అయితే దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.