ఏపీలో ఫెయిలైన విధానం తెలంగాణలో ఎందుకు.. రేవంత్ సర్కార్‌పై హరీష్ రావు ఫైర్

2 hours ago 2
పాలిటెక్నిక్‌ కాలేజీలను స్కిల్‌ యూనివర్సిటీలో విలీనం చేయడంపై మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జీవో 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఏపీ, ఢిల్లీలో ఇలాంటి విధానాలు విఫలం కావడంతో వెనక్కి తీసుకున్నారని గుర్తు చేసిన హరీష్ రావు.. అక్కడ ఫెయిలైన విధానాన్ని తెలంగాణలో ఎందుకు అమలు చేస్తున్నారని నిలదీశారు. వరంగల్‌లో పాలిటెక్నిక్‌ విద్యార్థుల ఆందోళనకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు.
Read Entire Article