, AP Municipal Commissioners Transferred: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పలువురు మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేశారు. ఈ మేరకు మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కొంతమందిని బదిలీపై పంపించగా.. కొందరికి పోస్టింగ్స్ ఇవ్వలేదు. అలాగే మొన్నటి వరకు వెయిటింగ్‌లో ఉన్న కొందరికి పోస్టింగ్స్ ఇచ్చారు. ఓ అధికారిని సీఆర్డీఏకు బదిలీ చేశారు. గతంలో కూడా భారీగా మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేశారు.. ఇప్పుడు మరోసారి బదిలీలు జరిగాయి.