ఏపీలో మరో గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణం కానుంది. నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్ అమరావతి ఔటర్ రింగ్ రోడ్డును అనుసంధానం చేస్తూ గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుకు కేంద్రం సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. రూ. 1400 కోట్ల ఖర్చుతో 48 కిలోమీటర్ల మేర ఈ గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మించాలని ప్రతిపాదించారు. ఇందులో రూ.300 కోట్లు భూసేకరణకు కేటాయించనున్నారు. అయితే కేంద్రం నుంచి పూర్తిస్థాయి అనుమతులు రాగానే.. ఆరు నెలల్లోగా భూసేకరణ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.