AP Free Bus Scheme: ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకానికి డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. సంక్రాంతి నుంచి అమలు చేయనున్నట్లు గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారు. ఈ పథకం అమలులో భాగంగా బస్సుల కొరత లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రస్తావించారు. ఫ్రీ బస్ వల్ల నష్టపోకుండా ఆటో డ్రైవర్లను దృష్టిలో పెట్టుకొని ఏపీ ప్రభుత్వం విధివిధానాలు రూపొందించే పనిలో ఉందని చెప్పారు.