ఏపీవాసులకు సూపర్ న్యూస్.. విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుల తొలిదశ డీపీఆర్‌లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. విశాఖ, విజయవాడ నగరాల్లో మెట్రో రైల్ ప్రాజెక్టుల తొలి దశ డీపీఆర్‌ను ఆమోదిస్తూ ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ కార్యదర్శి కన్నబాబు ఉత్తర్వులు జారీచేశారు. ఈ డీపీఆర్‌లను కేంద్రానికి సమర్పించనున్నారు. కేంద్ర ప్రభుత్వం అందించే నిధులతోనే విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టులు చేపట్టాలని నిర్ణయించారు. విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టు తొలి దశలో 46.23 కిలోమీటర్ల మేర మూడు కారిడార్లు నిర్మించనున్నారు.