Nadendrla Manohar Review On Civil Supplies: ఏపీ ప్రజలకు సబ్సిడీ సరుకులను అందజేయడానికి సహకరించాలని దిగుమతిదారుల్ని మంత్రి నాదెండ్ల మనోహర్ కోరారు. ఆయన వంటనూనె దిగుమతిదారులు, కందిపప్పు సరఫరాదారులతో సమావేశం నిర్వహించారు. ప్రజలకు కూటమి ప్రభుత్వం భారీ ఊరట కల్పించిందని అన్నారు మంత్రి.పెరిగిన ధరల నుంచి ప్రజలను కాపాడేందుకు తక్కువ ధరకే వంట నూనెను అందించాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. అందులో భాగంగా పామాయిల్ లీటరు రూ. 110. సన్‌ప్లవర్ ఆయిల్ రూ. 124 ధరల్లో ప్రజలకు అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రజల కోసం కూటమి ప్రభుత్వం నష్టాన్ని భరిస్తూ సబ్సిడీపై కందిపప్పు అందించాలనే ఆశయంతో పనిచేస్తుందన్నారు.