Andhra Pradesh Government Launches Mana Mithra Whatsapp Governance: దేశంలో తొలిసారిగా ఏపీ ప్రభుత్వం పౌరసేవలు అందించేందుకు వాట్సాప్ గవర్నెన్స్‌ను తీసుకొచ్చింది. ఈ సేవలను ఉండవల్లిలోని నివాసంలో మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం అధికారిక వాట్సాప్ నంబర్ 95523 00009ను కేటాయించింది. ప్రభుత్వం తొలి దశలో మొత్తం 161 రకాల పౌర సేవలను అందించనుంది. రెండో విడతలో మరిన్ని సేవలను అందుబాటులోకి రానున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.