CM Chandrababu Review Meeting On New Sports Policy: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్ పెంచాలని నిర్ణయించింది. రాష్ట్రంలో నూతన క్రీడా విధానంపై సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక ప్రతిపాదనలు, నిర్ణయాలు తీసుకున్నారు. ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్ 2 నుంచి 3 శాతానికి పెంచాలని నిర్ణయించారు. అలాగే ఒలింపిక్స్, ఏసియన్ గేమ్స్, జాతీయ క్రీడాల్లో పాల్గొని పతకాలు సాధించే రాష్ట్ర క్రీడాకారులకు భారీగా ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఆ మొత్తా్న్ని కూడా పెంచుతూ ప్రతిపాదనలు చేశారు.