AP Street Vendors Loan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీధి వ్యాపారుల అభివృద్ధికి ప్రత్యేకంగా లోక్ కల్యాణ్ మేళాను నిర్వహిస్తోంది. ఏలూరు జిల్లాలో ఈ నెల 24 నుంచి ప్రత్యేక మేళాలు జరుగుతున్నాయి. ఈ మేళా ద్వారా వీధి వ్యాపారులకు వివిధ పథకాలతో అనుసంధానం చేసి, గుర్తింపు, ఆరోగ్య కార్డులు అందజేస్తారు. అంతేకాకుండా, డిజిటల్ చెల్లింపులపై అవగాహన కల్పిస్తారు. అర్హులైన వారికి రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు రుణాలు 7 శాతం వడ్డీతో ఇస్తారు. సక్రమంగా వాయిదాలు చెల్లిస్తే వడ్డీ రాయితీ కూడా లభిస్తుంది.