AP Annual Family Income Limit Increase Proposal: ఏపీలో సంక్షేమ పథకాలకు సంబంధించి కొన్ని నిబంధనలు అమల్లో ఉన్నాయి. అందులో ముఖ్యమైన కుటుంబ వార్షికాదాయం.. అయితే ఆ వార్షికాదాయాన్ని పెంచాలనే ప్రతిపాదన ఉంది. అయితే ఈ డిమాండ్‌ను ఆర్థికశాఖ దృష్టికి తీసుకెళ్తానన్నారు సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి. అలాగే ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల పిల్లలకు ప్రభుత్వ పథకాలు వర్తింపచేసేలా ప్రతిపాదనల్ని ప్రభుత్వ పరిశీలనకు పంపిస్తామని కూడా మంత్రి తెలిపారు.