Andhra Pradesh Go 117 Cancel: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. జీవో నంబర్ 117ను రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉపాధ్యాయ సంఘాల నేతలతో సమావేశం నిర్వహించారు.. పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకున్నారు. ఉపాధ్యాయుల ప్రమోషన్లు, బదిలీలపై కూడా వచ్చేవారం చర్చించనున్నారు. అలాగే వచ్చే నెలలో చేపట్టబోయే కార్యక్రమాలపై కూడా చర్చ జరిగింది. ఉపాధ్యాయ సంఘాలు సైతం ప్రభుత్వానికి పలు సమస్యల్ని విన్నవించాయి.