ఐ బొమ్మ రవి.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు గురించి తెలియని వాళ్లు ఉండరు. ఒక వైపు సినిమా ఇండస్ట్రీకి పెద్ద విలన్, మరో వైపు సామాన్య ప్రేక్షకులకు దేవుడు. తెలుగు రాష్ట్రాల్లోని సినీ ప్రియులకు అనధికార ఓటీటీగా మారిపోయిన ఐబొమ్మ (iBomma) వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి మధ్య తరగతి ప్రజల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. కాగా ఇప్పుడు ఆయన బయోగ్రఫి తెరకెక్కుతుంది. అదే iAMRAVii మూవీ. ప్రముఖ యూట్యూబర్ దొరసాయి తేజ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ తాజాగా రిలీజైంది.