ఐబొమ్మ కేసులో ఇమ్మడి రవిని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్న పోలీసులు సంచలన విషయాలు వెలుగులోకి తీసుకువస్తున్నారు. సినిమాలను ఇమ్మడి రవి నేరుగా పైరసీ చేయలేదని గుర్తించారు. టెలిగ్రామ్, మూవీరూల్జ్ వంటి ఇతర పైరసీ సైట్ల నుంచి సినిమాలను కొనుగోలు చేసినట్లు తేలింది. పైరసీ ప్రింట్లను హెచ్‌డీ ప్రింట్లుగా మార్చాడని.. పోలీసులు వెల్లడించారు. ఇక సినిమాలను కొనుగోలు చేసేందుకు క్రిప్టో కరెన్సీని ఉపయోగించినట్లు వెల్లడైంది. ఇక ఇమ్మడి రవి రూ.20 కోట్ల వరకు సంపాదించినట్లు పోలీసులు గుర్తించారు.