ఒకప్పుడు హైదరాబాద్ అంటే చార్మినార్ బిర్యానీ గుర్తుచొచ్చేదని ఇప్పుడా పేరు మారిందని సీఎం రేవంత్ అన్నారు. హైదరాబాద్ ప్రస్తుతం వరల్డ్ వ్యాక్సిన్ తయారీ కేంద్రంగా పేరు మార్చుకుందని చెప్పారు. హైదరాబాద్ హైటెక్స్‌లో ప్రారంభమైన బయోఏషియా-2026 సదస్సును ప్రారంభించిన సీఎం హైదరాబాద్ నగరంలో పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు.