విజయవాడ టీడీపీ నేతలు కేశినేని చిన్ని, బుద్ధా వెంకన్న.. వైసీపీ నేత పోతిన మహేష్ ఒకే వేదికను పంచుకున్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. శ్రీనగరాల సీతారామస్వామి ఆలయం నూతన పాలకమండలి శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసింది. ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన, వైసీపీ నేతలు పాల్గొన్నారు. అయితే బోండా ఉమా, అంబటి ఎపిసోడ్ తర్వాత వైసీపీ నేతలతో వేదికను పంచుకోవద్దని టీడీపీ అధిష్టానం ఆదేశించిన తరుణంలో.. ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.