బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ (Vicky Kaushal), హీరోయిన్ కత్రినా కైఫ్ (Katrina Kaif) 2021లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ స్వీట్ కపుల్ జీవితంలోకి మరొకరు రాబోతున్నారు. ఇందుకు సంబంధించిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ బేబీ బంప్ ఫొటోలను కత్రినా షేర్ చేసింది.