ఏపీలోని కరెంట్ వినియోగదారులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ వినిపించారు. కరెంట్ ఛార్జీలను పెంచడం లేదని క్లారిటీ ఇచ్చారు, సోమవారం రోజున సచివాలయంలో చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ క్రమంలోనే విద్యుత్ ఛార్జీల ప్రస్తావన తెచ్చారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంట్ ఛార్జీలు పెంచకుండానే విద్యుత్ వ్యవస్థను గాడిలో పెట్టామని చంద్రబాబు వివరించారు.