కర్నూలులో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల నుంచి అవయవాలు సేకరించి సక్సెస్‌ఫుల్‌గా ఇద్దరికి రీప్లేస్ చేయడంపై మంత్రి టీజీ భరత్ హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు లాంటి ప్రాంతాల్లో జరిగే శస్త్ర చికిత్సను కర్నూలు వైద్యులు విజయవంతంగా చేయడంపై ఆయన అభినందించారు. దాదాపు 20 గంటల పాటు శ్రమించి అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలు విజయవంతంగా నిర్వహించారని మంత్రి కొనియాడారు. రాయలసీమలోని కర్నూలులో ఈ అవయవ మార్పిడి శస్త్ర చికిత్స జరగడం వైద్య రంగంలో కీలక ముందడుగుగా మంత్రి టీజీ భరత్ అభివర్ణించారు.