Kanipakam Temple Online Booking Services Started: ఇకపై కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి దర్శనం, వసతి, సేవలు, ప్రసాదం టికెట్లు ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకోవచ్చు. కొత్త వెబ్‌సైట్, వాట్సప్ ద్వారా కూడా సేవలు అందుబాటులోకి వచ్చాయి. వేలాది మంది భక్తులు వచ్చే ఈ ఆలయంలో, ఆర్జిత సేవా టికెట్ల కోసం ఇకపై క్యూలో నిలబడాల్సిన అవసరం లేదు. అలాగే భక్తుల సౌకర్యం కోసం కియోస్క్ యంత్రాలు కూడా ఏర్పాటు చేయనున్నారు.