కామారెడ్డి రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీకి కూడా పూర్తి మెజారిటీ రాకపోవటంతో మున్సిపాల్టీని ఎవరు కైవసం చేసుకుంటారనేదీ ఆసక్తికరంగా మారింది. తాజాగా తాము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామంటూ బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు వీడియో విడుదల చేశారు. తాము కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు సోషల్ మీడియాలో జరుగుతోందని తప్పుడు ప్రచారమని క్లారిటీ ఇచ్చారు. మరోవైపు కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీకి ముగ్గురు స్వతంత్రులు, ప్రధాన పార్టీకి చెందిన మరో ముగ్గురు కౌన్సిలర్లు మద్దతు ఇచ్చినట్లు ప్రచారం జరిగింది.