సొంత జిల్లా మహబూబ్ నగర్లో సీఎం రేవంత్ నేడు పర్యటించారు. చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్లోని కురుమూర్తి స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అంతకు ముందు కురుమూర్తి స్వామి దేవాలయానికి ఘాట్ రోడ్, ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సీఎం రేవంత్ శంకుస్థాపన చేశారు. రూ.110 కోట్లతో ఈ పనులు చేపడుతుండగా.. మంత్రులు కోమటిరెడ్డి, దామోదరతో కలిసి పనులు ప్రారంభించారు.