Today Kukatpally Traffic Diversions: హైదరాబాద్, కూకట్‌పల్లిలో నేడు అఖండ 2 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం జరగనుంది. దీని కోసం కూకట్‌పల్లిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కైతలాపూర్ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాల్లో వాహనాల మళ్లింపు ఉంటుందని అధికారులు తెలిపారు. అభిమానులు భారీగా తరలివచ్చే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పేర్కొన్నారు. ఈ ఆంక్షల వల్ల కొద్దిసేపు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పకపోవచ్చు.