నల్లమల అటవీ అందాలు, కృష్ణానది పరవళ్లు, ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనంతో ప్రత్యేక గుర్తింపు పొందిన కొల్లాపూర్‌ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నారు. సోమశిల, మల్లేశ్వరం ప్రాంతాల్లో రూ.57.63 కోట్లతో పనులు చేపట్టారు. సోమశిల ఆలయంలో రూ.6 కోట్లతో వసతి, క్యాంటీన్, పిల్లల ఆటస్థలం ఏర్పాటు చేస్తున్నారు. మల్లేశ్వరం ద్వీపంలో రూ.47.44 కోట్లతో 30 కాటేజీలు, స్పా, వాచ్‌టవర్, బోటింగ్ సదుపాయాలు కల్పిస్తున్నారు. బోటింగ్ పనులు పూర్తికాగా, ఇతర పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి.