జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ తరలింపు కోసం పాదయాత్ర చేపట్టిన ఎంపీ ఈటల రాజేందర్.. రాష్ట్ర ప్రభుత్వానికి బహిరంగ సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్ రెడీ చేస్తే.. కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఒకవేళ కేంద్రం నిధులు తీసుకురావడంలో తాను విఫలమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సంచలన ప్రకటన చేశారు. మూసీ ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధను ప్రస్తావిస్తూ జవహర్‌నగర్ సమస్యను కూడా ప్రాధాన్యంగా తీసుకోవాలని కోరారు.