బీఆర్ఎస్ నేత కేటీఆర్ గడ్డం పెంచడంపై ఎంపీ ధర్మపురి అర్వింద్ సెటైర్లు వేశారు. గడ్డం పెంచుకుంటే సీఎం అవుతారని ఎవరో చెప్పడంతోనే కేటీఆర్ అలా చేస్తున్నారేమోనని ఎద్దేవా చేశారు. గతంలో కేసీఆర్ కొత్త సచివాలయం నిర్మించినా ఎన్నికల్లో గెలవలేకపోయారని.. ఉత్తమ్ కుమార్ రెడ్డి గడ్డం పెంచినా కాంగ్రెస్ బలపడలేదని సెటైర్లు వేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య పొత్తు చర్చలు జరుగుతున్నాయని ఆరోపించిన ధర్మపురి అర్వింద్.. 2028 ఎన్నికల్లో బీజేపీ ఎవరితోనూ పొత్తు లేకుండా అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.