భవన నిర్మాణంలో విప్లవాత్మక మార్పులు తెస్తూ 3డీ ప్రింటింగ్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. ఈ సరికొత్త పద్ధతిలో కంకర, పిల్లర్ల అవసరం లేకుండా.. ఫ్లైయాష్, సిమెంట్‌తో తయారు చేసిన నిర్మాణ బ్లాక్‌లతో ఇళ్లను నిర్మిస్తున్నారు. కేవలం 45 రోజుల వ్యవధిలోనే 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ. 2 లక్షల వంటి తక్కువ బడ్జెట్‌తో లగ్జరీ తరహా ఇళ్లను నిర్మించవచ్చు. సాంప్రదాయ ఇళ్లతో పోలిస్తే ఇది తక్కువ కార్బన్ ఉద్గారాలను విడుదల చేసి, చల్లగా ఉంటుంది.