కేవలం రూ.26 లక్షలకే హైదరాబాద్‌లో ఫ్లాట్.. సొంతింటి కలను నెరవేర్చుకునే గొప్ప అవకాశం..

7 months ago 23
తెలంగాణ హౌసింగ్ బోర్డు (TGHB) గచ్చిబౌలి, వరంగల్, ఖమ్మం ప్రాంతాల్లో లోయర్ ఇన్‌కమ్ గ్రూప్ (LIG) ప్రజల కోసం సరసమైన ధరల్లో ఫ్లాట్స్‌ను విక్రయానికి ఉంచింది. గచ్చిబౌలిలో రూ.26 లక్షల నుంచే ఫ్లాట్స్ అందుబాటులో ఉండటం విశేషం. ఐటీ హబ్‌కు సమీపంలోని ఈ ఫ్లాట్స్‌కు భారీ స్పందన వచ్చే అవకాశం ఉంది. వరంగల్‌లో రైల్వే స్టేషన్ సమీపంలో 102 ఫ్లాట్స్, ఖమ్మంలో శ్రీరామ్ హిల్స్ ప్రాంతంలో 126 ఫ్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. అన్ని ప్రాంతాల్లోనూ ఫ్లాట్స్‌ను లాటరీ విధానంలో కేటాయిస్తారు. దరఖాస్తులకు చివరి తేదీ జనవరి 3, 2026గా పేర్కొన్నారు.
Read Entire Article