సీఎం రేవంత్రెడ్డి ఈనెల 7 నుంచి 3 రోజుల పాటు తన సొంత నియోజకవర్గం కొడంగల్లో పర్యటించనున్నారు. హకీంపేటలో మూడు రోజుల మెగా రైతుమేళా, ఇండస్ట్రియల్ ఎక్స్పోను ప్రారంభిస్తారు. 26 ప్రభుత్వ శాఖల భాగస్వామ్యంతో 150 స్టాళ్లలో ఆధునిక వ్యవసాయ యంత్రాలు, డ్రోన్లు, విత్తనాలు, కొత్త సాగు పద్ధతులను ప్రదర్శించనున్నారు. రెండో రోజు మహిళా సంఘాలతో సమావేశమై పలు ప్రభుత్వ భవనాలను ప్రారంభించడంతో పాటు రహదారులు, ఎత్తిపోతల పథకం, పామాయిల్ ఫ్యాక్టరీ వంటి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తారు. మొత్తం రూ.9,053 కోట్లకు పైగా విలువైన 13 అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. చివరి రోజు 10 జిల్లాల నుంచి సుమారు 50 వేల మంది రైతులతో జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.