కరోనా వైరస్ పోయిందనుకుని అందరూ ప్రశాంతంగా ఉన్న సమయంలో మళ్లీ కొత్త వైరస్‌ను పట్టుకొచ్చి ప్రపంచాన్ని భయపెట్టే ప్రయత్నం చేస్తోంది చైనా. ఈ వైరస్ ఇప్పుడు చైనాతో పాటు జపాన్‌కు కూడా వ్యాపించింది. ఈ క్రమంలో ప్రపంచ దేశాలు కూడా అప్రమత్తవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే.. తెలంగాణ వైద్యారోగ్య శాఖ కూడా అప్రమత్తమమైంది. రాష్ట్ర ప్రజలకు వైద్యారోగ్యశాఖ కీలక సూచనలు చేసింది. ఫ్లూ లాంటి లక్షణాలున్నవారు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది.