హుస్నాబాద్ నియోజకవర్గాన్ని ఎడ్యుకేషన్ హబ్‌గా అభివృద్ధి చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ఉమ్మాపూర్‌లో శాతవాహన యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల బాలుర, బాలికల హాస్టళ్లకు శంకుస్థాపన చేశారు. కొత్త కోర్సులు, బస్సులు, విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తామని తెలిపారు. నవోదయ స్కూల్, తెలంగాణ పబ్లిక్ స్కూల్, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు, బాసర ట్రిపుల్ ఐటీ బ్రాంచ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కబడ్డీ అకాడమీ, స్పోర్ట్స్ స్టేడియం, పారిశ్రామిక కారిడార్, అర్బన్ ఫారెస్ట్ పార్క్, ఎల్లమ్మ చెరువు అభివృద్ధి పనులు చేపడతామని మంత్రి వెల్లడించారు.