Canada Girl Love Marriage Amalapuram Man: బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన అబ్బాయి, కెనడా అమ్మాయి ప్రేమ పెళ్లితో ఒక్కటయ్యారు. అమలాపురం మండలం ఈదరపల్లికి చెందిన మనోజ్ కుమార్ కెనడాకు చెందిన ట్రేసి రోచేడాన్తో ప్రేమలో పడ్డాడు. వీరు 7 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. మనోజ్ కుమార్ ప్రస్తుతం కెనడాలో బ్యాంక్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. మనోజ్ కుమార్‌కి, అతని ప్రేయసికి కెన్యాలో నిశ్చితార్థం.. కెనడాలో వివాహం జరిగింది. మనోజ్ సొంత ఊరిలో హిందూ సాంప్రదాయంగా వివాహం చేసుకునేందుకు వచ్చారు. ఈ వారంలో మలికిపురం మండలం దిండిలో వివాహం..ఈ నెల 8న రిసెప్షన్ ఉంటుందన్నారు మనోజ్.