హైదరాబాద్ సమగ్ర అభివృద్ధి, పాలన కోసం రూపొందించిన కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్) బిల్లు-2026కు శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. బిల్లులో మొదట ప్రతిపాదించిన 20 శాతం వార్షిక ఆస్తిపన్ను పెంపును సభ్యుల అభ్యంతరాల నేపథ్యంలో గరిష్ఠంగా 10 శాతానికి తగ్గించారు. క్యూర్ పరిధిలోని మూడు కార్పొరేషన్లకు సమన్వయ పాలన, సింగిల్ డిజిటల్ వేదిక, ప్రత్యేక అప్పిలేట్ అథారిటీ ఏర్పాటు చేయనున్నారు. మూసీ పునరుజ్జీవనం, గోదావరి జలాల తరలింపు, వరదనీటి నిర్వహణ, పచ్చదనం పెంపునకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.