ఈ మధ్య కాలంలో చిన్న సినిమా, పెద్ద సినిమా అని తేడాలేవి లేవు. కంటెంట్‌తో వచ్చే ప్రతీ చిన్న సినిమా కూడా పెద్ద సినిమాల రేంజ్‌లో హిట్లు కొడుతున్నాయి. అలా క్రేజీ కథతో రాబోతున్న సినిమా పతంగ్. టాలీవుడ్ సింగర్ ప్రణవ్ కౌశిక్, ప్రీతి పగడాల, వంశీ పుజిత్ ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రతీక్ పత్తిపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 25న రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా మేకర్స్ ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ట్రైలర్ మాత్రం సూపర్ ఉంది. యూత్‌కు కనెక్ట్ అయ్యే స్టోరీలా ఉంది. లవ్, డ్రామా, ఎమోషన్ అన్ని ట్రైలర్‌లో చూపించారు. కంటెంట్ కొత్తగా ఉంటే.. మంచి హిట్టు కొట్టడం మాత్రం గ్యారెంటీ.