గచ్చిబౌలి ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం.. స్కూటీని ఢీకొట్టిన బుల్లెట్ బైక్.. ఇద్దరు దుర్మరణం

2 months ago 13
హైదరాబాద్ ఐటీ కారిడార్‌ పరిధిలోని గచ్చిబౌలి ఏఎంబీ మాల్ ఫ్లైఓవర్‌పై శుక్రవారం ఉదయం ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హఫీజ్‌పేట వైపు నుంచి గచ్చిబౌలికి ఫ్లైఓవర్‌పై ప్రమాదకరంగా రాంగ్ రూట్‌లో దూసుకొచ్చిన స్కూటీని.. నిబంధనల ప్రకారం వెళ్తున్న బుల్లెట్ బైక్ ముఖాముఖి ఢీకొట్టింది. ఈ భీకర ప్రమాదంలో స్కూటీపై ప్రయాణిస్తున్న శ్రీకాంత్, విఠల్ అనే ఇద్దరు వ్యక్తులు రోడ్డుపై ఎగిరిపడి.. తీవ్ర తలగాయాల కారణంగా అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ప్రమాద సమయంలో బాధితులు హెల్మెట్ ధరించకపోవడమే ఈ ఘోర ప్రాణనష్టానికి కారణం అని పోలీసులు ప్రాథమికంగా నిర్దారించారు.
Read Entire Article