నల్గొండ జిల్లా తిరుమలగిరిసాగర్ మండలం చింతలపాలెంలో వినాయక చవితి వేళ విషాదం చోటుచేసుకుంది. నాగార్జునసాగర్‌కు చెందిన పూజారి ఉప్పల దత్తు ప్రసాద్ గణేశ్ మండపంలో పూజలు నిర్వహిస్తుండగా ఇద్దరు వ్యక్తులు తమ మండపం వద్ద ముందుగా పూజ చేయాలని కోరుతూ వాగ్వాదానికి దిగారు. గ్రామ పెద్దలు జోక్యం చేసుకుని పూజారిని మండపం వద్దకు తీసుకెళ్లారు. అక్కడ పూజలు నిర్వహిస్తూనే దత్తు ప్రసాద్ అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోయారు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు.