ములుగు జిల్లా వాజేడు ఎస్సై రుద్రారపు హరీష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఓ రిసార్ట్‌లో సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని సూసైడ్ చేసుకున్నాడు. ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగిన రాత్రే ఎస్సై సూసైడ్ చేసుకోవటం డిపార్ట్‌మెంట్‌లో కలకలం రేపుతోంది. అసలేం జరిగి ఉంటుందని ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. అయితే ఎస్సై హరీష్ వ్యక్తిగత కారణాలతోనే ప్రాణాలు తీసుకున్నట్లు తెలిసింది. ప్రేమ వ్యవహారమే సూసైడ్‌కు కారణంగా భావిస్తున్నారు.