పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగుప్ప గ్రామంలో మలేరియా నివారణ మాత్రలు వికటించి ఒక బాలిక మృతిచెందిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది. చిన్నా పెద్దా కలిపి మొత్తం 57 మంది వరకూ ఈ మాత్రల ప్రభావంతో ఆస్పత్రి పాలయ్యారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించి, పరిస్థితి గురించి తెలుసుకున్నారు. పోలవరం జిల్లా కలెక్టర్‌తో పాటు మిగతా అధికారులతో కూడా సీఎం మాట్లాడారు. ఈ ఘటనపై వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌తో పాటు ఇన్‌చార్జ్ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కూడా అధికారులతో మాట్లాడారు.