తెలంగాణ సంక్షేమ గురుకుల విద్యార్థులకు నైట్ డ్రెస్‌లు, ట్రాక్ సూట్లు, పీటీ సూట్లను నవంబరులోగా పంపిణీ చేయనున్నట్లు ఎస్సీ గురుకుల సొసైటీ పీఎంయూ ఛైర్మన్ రవి నాయక్ తెలిపారు. రెండో జత యూనిఫాం వస్త్రాల సేకరణ పూర్తయిందని, వారం రోజుల్లో పంపిణీ చేస్తామని వెల్లడించారు. వైట్ యూనిఫాం సరఫరా కోసం వర్క్ ఆర్డర్ చేపట్టారు. యూనిఫాం కొరత నివారణకు పది శాతం అదనంగా సమీకరించగా.. నాణ్యతా లోపాలుంటే గుత్తేదారులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎడ్యుకేషన్ కిట్ల సరఫరాను కూడా సమీక్షిస్తున్నారు.