2027 జూన్ 26 నుంచి జులై 7 వరకు జరగనున్న గోదావరి పుష్కరాల కోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లను వేగవంతం చేస్తోంది. సుమారు రూ.900 కోట్ల శాశ్వత పనులకు ఆమోదం తెలిపింది. ఎనిమిది జిల్లాల్లో 67 ప్రాంతాల్లో పుష్కర ఘాట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వీటిలో 11 ప్రాంతాలను తొలి ప్రాధాన్యత జాబితాలో చేర్చింది. గూడెంగుట్ట, ఓదెల, కొడవటంచ ఆలయాల అభివృద్ధితోపాటు పుష్కరాల పనుల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారి కార్యాలయాన్ని ఏర్పాటు చేయనుంది.